మారిన జీవనశైలి కారణంగా చాలామంది జంటలు ఈ రోజుల్లో సంతానలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ వద్దని లేటు చేస్తున్నారు.కానీ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావాలని ఎంత కోరుకున్న కూడా రాదు. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చరు. వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు అయిన కలయికలో పాల్గొనాలి. అప్పుడే తొందరగా గర్భం దాల్చుతారు. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో కొందరు శృంగారానికి దూరంగా ఉంటున్నారు. వీటితో పాటు ఇప్పుడున్న ఉన్న జీవనశైలి, ఆహారంలో మార్పుల వల్ల స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా లోపాలు ఉండటం వల్ల సంతానలేమి సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే ప్రెగ్నెన్సీ తొందరగా రావాలంటే.. ఏ సమయంలో భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనాలో తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలామంది జంటలకు ముఖ్య సమస్య సంతానలేమి. ప్రపంచ వ్యాప్తంగా 80 మిలియన్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే తొందరగా గర్భం దాల్చాలంటే అండం విడుదలయ్యే డేట్‌లో జంటలు కలయికలో పాల్గొవడం వల్ల తొందరగా గర్భం దాల్చుతారు. రుతుచక్రాన్ని బట్టి అండం విడుదల అవుతుంది. ఆ తేదీని కౌంట్ చేసి ఆరోజు కలవాలి. సాధారణంగా రుతుచక్రం 28 రోజులకు ఉంటుంది. రుతుచక్రం ఎనిమిదో రోజు నుంచి కలయికలో పాల్గొనాలి. రోజు విడిచి రోజు 14వ రోజు వరకు కలయికలో పాల్గొంటే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. భార్యాభర్తలు ఇలా అండం విడుదలయ్యే సమయంలో కలవడంతో పాటు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలు డైట్‌లో యాడ్ చేసుకోవాలి.
మన అలవాట్లను మార్చుకోవడం వల్ల కూడా సంతానలేమి సమస్య తగ్గి.. తొందరగా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది అధికంగా బరువు ఉంటారు. దీనివల్ల చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి బరువు కాస్త తక్కువగా ఉండేలా చూసుకోండి. కొంతమందికి పీసీఓడీ, ధైరాయిడ్ వంటి సమస్యలు ఉంటాయి. వీటివల్ల గర్భం దాల్చడం కాస్త ఆలస్యం అవుతుంది. వీటితో పాటు ఆహార విషయంలో మార్పులు చేయాలి. డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు, బాదం వంటివి తినాలి. ఆహార పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు, ఫోలిక్ యాసిడ్, మినరల్స్, ప్రొటీన్స్ ఉండేలా చూసుకోవాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. అన్నింటి కంటే ముఖ్యంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళన లేకుండా సంతోషంగా ఉండాలి. అప్పుడే గర్భం తొందరగా దాల్చే అవకాశం ఉంటుంది. ఎంత బిజీ లైఫ్‌లో ఉన్నా కూడా పిల్లలపై దృష్టి పెట్టాలి. చదువు, ఉద్యోగం, వేరే ఇతర కారణాల వల్ల గర్భం దాల్చడం లేటు చేయకూడదు. వయస్సు పెరిగే కొలది అండం నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.