టీవీఎస్ ఐక్యూబ్.. ప్రముఖ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్కూటర్ రూ. 1,85,373 నుంచి రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది.అలాగే 2.2 కేడబ్ల్యూహెచ్, 3.4 కేడబ్ల్యూహెచ్, 5.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికలలో లభిస్తోంది. ఒక్కసారి చార్జింగ్ తో 75 నుండి 150 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణం చేయవచ్చు. టీఎఫ్ టీ స్క్రీన్, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, వాయిస్ అసిస్ట్ అలెక్సా స్కిల్‌సెట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.ఓలా.. ఓలా నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ల కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఓలా ఎస్1 ఎక్స్, ప్రో తదితర వేరియంట్లను అనేక ప్రత్యేకతలతో రూపొందించారు. వీటి ధరలు రూ. 74,999 నుంచి రూ. 1.29 లక్షల (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లలో 2 కేడబ్ల్యూ, 3 కేడబ్ల్యూ, 4 కేడబ్ల్యూ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. వేరియంట్ల వారికి వాటిని ఎంపిక చేసుకోవచ్చు. చార్జింగ్ విషయానికి వస్తే ఒక్కసారి చార్జింగ్ చేస్తే 95 నుంచి 195 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది.హీరో విడా.. హీరో విడా స్కూటర్ రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 కు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. దీనిలో వీ1 ప్లస్, వీ1 ప్రో వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఛార్జింగ్‌తో 100 నుంచి 110 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. వీటి గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పనిచేస్తాయి. వీటిలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు.
బిగాస్ ఆర్యూవీ 350.. మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి బిగాస్ ఆర్యూవీ 350 మంచి ఎంపిక. ఈ స్కూటర్ రూ.1,09,999 నుంచి రూ. 1,34,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 90 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీనిలో ఆర్యూవీ 350ఐ ఈఎక్స్, ఆర్యూవీ 350 ఈఎక్స్, ఆర్యూవీ 350 మ్యాక్స్ వేరియంట్ల లో గ్రే, ఆరెంజ్, పసుపు రంగులలో అందుబాటులో ఉన్నాయి.బజాజ్ చేతక్.. అందరికీ ఇష్టమైన బజాజ్ చేతక్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలయ్యాయి. వీటి ధరలు రూ. 95,998 నుంచి రూ. 1.47 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉన్నాయి. 3201 స్పెషల్ ఎడిషన్ 2901, అర్బేన్, ప్రీమియం వేరియంట్లను ఎంపిక చేసుకోవచ్చు. 113 నుండి 136 కిలోమీటర్ల రేంజ్ (మైలేజీ) అందిస్తాయి.