స్మార్ట్‌ఫోన్‌ల నాణ్యత రోజురోజుకు క్షీణిస్తుందని టెక్ యూట్యూబర్ గీకీ రంజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. నేటి కాలంలో ఫోన్ల కంపెనీలు కేవలం 2-3 సంవత్సరాలు మాత్రమే ఉండే స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తున్నాయా? అని ఎక్స్ లో ప్రశ్నించారు.
"స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఇప్పుడు కేవలం 2-3 సంవత్సరాల పాటు పనిచేసే ఫోన్‌లను తయారు చేయడం ప్రారంభించాయి. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు ఆ సమయం తర్వాత వేరే ఫోన్ కి మారవచ్చు అని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు భావిస్తున్నాయి" అని తెలిపారు.