రిలయన్స్ జియో.. వచ్చీరావడంతోనే సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిందని చెప్పొచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్, డేటా ఆఫర్లతో భారత టెలికాం రంగంలో ఒక విప్లవమే సృష్టించింది. అప్పటివరకు పరిమిత కాలింగ్, డేటాతో గడిపిన జనం.. జియో రాకతో అన్‌లిమిటెడ్‌కు మారిపోయారు.. కాదు కాదు అలవాటుపడ్డారు. ఇదే క్రమంలో.. పోటీని తట్టుకునేందుకు.. తమ ఉనికి నిలుపుకునేందుకు.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటివి కూడా దిగొచ్చాయి. అన్‌లిమిటెడ్ ప్లాన్స్ తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత జియో పోటీని తట్టుకోలేక.. వొడాఫోన్, ఐడియా విలీనం కూడా కావాల్సి వచ్చింది. ఉన్నట్లుండి సజావుగా సాగుతున్న తరుణంలో.. 2 నెలల కిందట ఒక్కసారిగా జియో తొలుత టారిఫ్స్ పెంచగా.. అదే బాటలో ఎయిర్‌టెల్, వొడా- ఐడియా కూడా పయనించాయి.
దీంతో కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ తగిలింది. కనీసం 10 శాతం నుంచి గరిష్టంగా 25 శాతం వరకు కూడా మొబైల్ రీఛార్జ్ ధరల్ని పెంచడం గమనార్హం. ఇదే క్రమంలో ఇన్నాళ్లుగా పట్టించుకోని బీఎస్ఎన్ఎల్ వైపు చాలా మంది చూస్తున్నారు. అక్కడ సరసమైన ధరల్లో నెలవారీ, వార్షిక ప్లాన్లు ఉండటంతో.. చాలా మంది పోర్ట్ అయినట్లు కూడా వార్తలొచ్చాయి.
అయితే.. ఇది తెలుసుకొని అప్రమత్తమైన జియో నష్టనివారణ చర్యగా బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్‌ను పోలి ఉన్న అచ్చం అలాంటి రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. కొంతకాలం కిందట.. మొత్తం డేటా ప్లాన్లే తప్ప.. వాల్యూ యాడెడ్ ప్లాన్స్ (కాలింగ్ అన్‌లిమిటెడ్, లిమిటెడ్ డేటా) కరవయ్యాయి. ఇప్పుడు.. మళ్లీ అలాంటి ప్లాన్స్ తీసుకొచ్చింది.
ముఖ్యంగా రూ. 1899 ధరతో.. 336 రోజుల వ్యాలిడిటీతో ఒక కొత్త ప్లాన్ ఆవిష్కరించింది రిలయన్స్ జియో. ఇక్కడ అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా 3600 ఫ్రీ ఎస్ఎంఎస్‌లు, ఫ్రీ నేషనల్ రోమింగ్, ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఇలా అన్నీ ఆఫర్ చేస్తూ.. మొత్తంగా 24 GB డేటాతో ప్లాన్ తెచ్చింది. ఇక్కడ నెలవారీగా అయితే రూ. 173 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ఇదే బీఎస్ఎన్ఎల్‌లో అయితే.. అచ్చం ఇలాంటి బెనిఫిట్స్‌తోనే ప్లాన్ ధర రూ. 1499గానే ఉంది.
>> డేటా అవసరం ఉన్న వాళ్లకు నెలవారీగా ప్లాన్లు కనీసం రూ. 200 పైనే ఉన్నాయని చెప్పొచ్చు. అది కూడా 28 రోజులు, 24 రోజులు, 18 రోజులు అని కాలపరిమితి తగ్గుకుంటూ.. ధరలు పెరుగుకుంటూ పోయాయి. కొందరు వైఫై ఉన్నవారు లేదా డేటా ఎక్కువగా అవసరం లేని వారు కూడా కచ్చితంగా డైలీ 1GB, 2GB డేటా ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. దానికి ఇప్పుడు పరిష్కారంలా జియో మొత్తం 3 ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇక్కడ నెలవారీ ప్లాన్ అయితే.. రూ. 189తో 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలిగ్ 28 రోజుల పరిమితితో, ఇదే 84 రోజులకు అయితే 6GB డేటా, అపరిమిత కాలింగ్‌తో ప్లాన్స్ వచ్చాయి.