వినాయక చవితి సందర్భంగా వివిధ రూపాల్లో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో చాక్లెట్ల వినాయకుడు కొలువుదీరాడు.
చిన్న పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లతో వినాయకుడిని తయారు చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేకూరకుండా చాక్లెట్లతో గణనాథుడిని కొలువు తీర్చారు. ఇక్కడ ప్రతీ సంవత్సరం పర్యావరణ హితంగా వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తుంటారు.