భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ జీవితకాల గరిష్ఠాలకు చేరువలోకి వచ్చాయి. అయితే, ముగింపు సమయానికి స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 97 పాయింట్ల వృద్ధితో 82,988 వద్ద ముగియగా... నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 25,383 వద్ద స్థిరపడింది. ఓ దశలో సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠం 83,184 పాయింట్లను తాకగా... నిఫ్టీ కూడా అదే బాటలో జీవితకాల గరిష్ఠం 24,445కి ఎగిసింది. అయితే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కొనుగోళ్ల ట్రెండ్ కనిపించడంతో సూచీలు స్వల్ప లాభాలకే పరిమితం అయ్యాయి.మెటల్, రియాల్టీ, ఎనర్జీ, వస్తు, మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీలు లాభాల బాటలో పయనించగా... ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫార్మా కంపెనీల షేర్లు నేలచూపులు చూశాయి.