నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి వీస్తున్న గాలులకు భారీ కెరటాలు ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవులో వాయుగుండం ప్రభావంతో సముద్రం ముందుకు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఓడలరేవు ఓఎన్‌జీసీ టెర్మినల్ ప్రహరీని కెరటాలు తాకుతున్నాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.