వాతావరణంలో పీఎం2.5 రేణువుల్లో ప్రధానంగా ఉండే అమ్మోనియం నైట్రేట్‌కు దీర్ఘకాలం లోనైతే చిన్నారుల్లో అభ్యసన నైపుణ్యాలు, జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతున్నట్లు అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం తేల్చింది.
వాయు నాణ్యతకు సంబంధించిన నిబంధనలను మెరుగుపరచడానికి, దీర్ఘకాల నాడీ సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ధూళి, నుసి, సేంద్రియ పదార్థాలు, లోహాల మిశ్రమంతో పీఎం2.5 రేణువులు తయారవుతాయి.