కడప నగరంలో గురువారం ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. కడప కార్పొరేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున టీడీపీ, వైసీపీ శ్రేణులు కార్పొరేషన్ వద్దకు చేరుకున్నారు.
కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు మినహా మిగతావారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. సమావేశంలో ఎమ్మెల్యే, మేయర్ కు మధ్య వాగ్వాదం జరగడంతో టీడీపీ శ్రేణులు మేయర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.