ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్‌ను జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది.మునాఫ్ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచింగ్ బృందంలో చేరనున్నాడు. ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావుతో కలిసి మునాఫ్ తన బాధ్యతలను నిర్వహించనున్నాడు.మునాఫ్ మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ లయన్స్‌తో కలిసి 63 IPL ఆటలను ఆడి, 7.51 ఎకానమీతో 74 వికెట్లు తీసిన అనుభవం కూడా ఉంది. అతను 2017లో తన చివరి IPL గేమ్‌లను ఆడాడు. ఇక టీమిండియా తరఫున ఆయన 86 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 125 వికెట్లు పడగొట్టాడు. 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న మునాఫ్, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ (2008), ముంబై ఇండియన్స్ (2013) తరఫున టైటిల్స్ సాధించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 41 ఏళ్ల మునాఫ్, తన కెరీర్‌లో తొలిసారిగా ఉన్నత స్థాయి కోచింగ్ బాధ్యతలు చేపట్టడం విశేషం.
గతంలో ఈ బాధ్యతను నిర్వహించిన జేమ్స్ హోప్స్ స్థానంలో ఇప్పుడు మునాఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అలాగే, రానున్న మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 73 కోట్ల పర్స్‌తో పాల్గొననుంది. నాలుగు కీలక ఆటగాళ్లైన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను రిటైన్ చేసుకున్న ఢిల్లీ, రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కార్డుతో మరో ఇద్దరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం ఇప్పటినుంచి బీసీసీఐ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసింది బీసీసీఐ. ఈ నెల చివర్లో ఐపీఎల్ మెగా వేలం కూడా నిర్వహించబోతుంది.