క్రికెట్ మ్యాచ్ ల్లో బ్యాట్స్ మన్లు చేసే సెంచరీకి ఎంత విలువ ఉంటుందో... బౌలర్లు నమోదు చేసే 5 వికెట్ల ప్రదర్శనకు కూడా అంతే విలువ ఉంటుంది. అదే ఓ బౌలర్ ఒక ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు ఒక్కడే తీస్తే అతడి ప్రదర్శన అద్భుతం అనాల్సిందే. భారత దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీలో నేడు ఈ ఘనత నమోదైంది. హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ కేరళపై ఆడుతూ 49 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. తద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా రికార్డు పుటల్లోకెక్కాడు. అన్షుల్ కాంభోజ్ కంటే ముందు... 1956లో బెంగాల్ బౌలర్ ప్రేమాంగ్సు ఛటర్జీ 20 పరుగులిచ్చి 10 వికెట్లు తీయగా... 1985లో రాజస్థాన్-విదర్భ మ్యాచ్ లో ప్రదీప్ సుందరం 78 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు