రాజాం పోలీస్ స్టేషన్ ను ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం సందర్శించారు. ముందుగా స్టేషన్ లో సిడి ఫైల్స్ ను తనిఖీ చేశారు. కేసుల పురోగతిని గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో శాంతిభద్రతల సమస్యలు, బెల్ట్ షాపులు నిర్వహణపై నిఘా పెట్టాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా దారుల సమాచారాన్ని సేకరించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.