రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను బుధవారం రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశమిచ్చినందుకు మంత్రి సవితకు సదాశిం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి సవితను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు.