చలికాలంలో అందరూ వేడివేడిగా ఉండే ఫుడ్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అందులో స్వీట్ కార్న్ కూడా ఒకటి. వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. వీటిని తినడం వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. వింటర్ రాగానే మనలో కొన్ని కోరికలు పుట్టుకొస్తాయి. చల్లని గాలుల్లో వేడివేడి ఫుడ్స్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి ఫుడ్ లిస్ట్‌లో స్వీట్ కార్న్ కూడా ఒకటి.
వీటిని మనం చిల్లీ డేస్‌లో తెగ ఎంజాయ్ చేస్తాం. నిజానికీ కార్న్ వింటర్‌లో ఎంజాయ్ చేస్తూ తినే పోషకాహారం అనుకోవచ్చు. స్వీట్‌కార్న్‌లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు బి విటమిన్స్ అయిన థయామిన్, నియాసిన్‌లు ఉంటాయి. వీటితో పాటు పాస్ఫరస్, మెగ్నీషియంలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వింటర్‌లో శరీరానికి మేలు చేస్తాయి.