ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అదానీ అవినీతి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం మంచిది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘అదానీ కంపెనీలతో కెన్యా ఒప్పందాలు రద్దు చేసుకున్నట్లు సీఎం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో ఏదో పెద్ద తల తప్ప ఇంకెవరూ కూడా ముడుపులుగా రూ. 1,750 కోట్లు అంత పెద్ద మొత్తాన్ని తీసుకోలేరు. అదానీ ముడుపుల వ్యవహారంపై సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ‘స్వర్ణాంధ్ర విజన్-2047’పై ఆర్థికవేత్తలు, మేధావి వర్గాలతో చర్చలు జరపాలి’ అని రామకృష్ణ అన్నారు.