బాపట్ల జిల్లా బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి పాల్గొని ప్రజా సమస్యల వింటూ వారు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల ఇచ్చిన అర్జీలు పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపడతానని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ప్రకార్ జైన్ పాల్గొన్నారు.