దేశ రాధాని ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శేఖవత్‌తో సమావేశం అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం పవన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గజేంద్ర సింగ్ అంటే అపారమైన గౌరవం ఉందని, ఆయన జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని అన్నారు. పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని, ఆంధ్రప్రదేశ్‌కు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్‌లా అభివృద్ధి చేయవచ్చునని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని కోరామని.. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.