ధాన్యం కొనుగోలుకు సంబందించి తేమ శాతం 17 వరకు, మట్టి, రాళ్లు, తాలు గింజల వంటివి ఇతర వ్యర్థాలు 1 శాతం వరకు ఉండొచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. చెడిపోవటం, రంగు మారటం, మొకలు వంటివి ఉన్న ధాన్యమయితే 5 శాతం, పక్వతలేని, ముడుచుకుపోయిన గింజలు 3 శాతం, ఏ గ్రేడ్ రకంలో తక్కువ రకం కానీ, కేళీలు 3 శాతం వరకు ఉండొచ్చని సూచించింది. అయితే ప్రస్తుతం తేమ శాతం సమస్యగా మారింది.
17 శాతం లోపు తేమ ఉంటే, ఎ గ్రేడ్ రకానికి రూ. 1740 చెల్లిస్తారు. అయితే ఆపై తేమ శాతం ఉన్నవాటికి మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వాతావరణం ఇబ్బందికరంగా ఉన్న తరుణంలో తేమ ఉన్న ధాన్యాన్ని అమ్మక తప్పదని, ప్రభుత్వ కొనకపోతే చివరకు దళారులకైనా తెగనమ్మక తప్పదని చైతులు చెబుతున్నారు. అయితే 17 శాతానికి మించిన అదనపు శాతాలకు 21 శాతం వరకు ప్రభుత్వమే ధరలో తరుగుదల నిర్ణయిస్తే, మిల్లర్ల దోపిడీ తగ్గుతుందనేది రైతుల విన్నపం.