ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో మరమ్మతులకు కూడా వీల్లేని విధంగా రోడ్లు దెబ్బతిన్నాయని.. ఈ నేపథ్యం లో 1,447 కిలోమీటర్ల మేర వాటిని పునర్నిర్మించాల ని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.650 కోట్ల నాబార్డు నిధులు అందించేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ రహదారుల పునర్నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని రోడ్లు-భవనాల శాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రోడ్లపై సోమవారం రాత్రి సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, అధికారులతో సమీక్షచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లపై గుంతలు పూడ్చేందుకు వివిధ పద్దుల కింద రూ. 861 కోట్లు కేటాయించారు. ఆర్‌అండ్‌బీ ఇప్పటి వరకు 1,991 కిమీ మేర గుంతలు పూడ్చినట్లు మంత్రి జనార్దన్‌రెడ్డి సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు.
జగన్ పాలనలో దెబ్బతిన్నవి, ఇటీవలకురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంస మై మరమ్మతులకు ఏమాత్రం వీలుకాని రోడ్లు 1,447 కిమీ వరకు ఉన్నాయని.. వాటిని పునర్నిర్మిస్తే తప్ప ప్రజలకు రహదారి సదుపాయం మెరుగ్గా కల్పించలేమని నివేదించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని కొన్ని రోడ్లు దారుణంగా ఉన్నాయని, వాటిపై ద్విచక్రవాహనాలు కూడా నడిపే పరిస్థితి లేనంతగా ధ్వంసమయ్యాయని.. వాటిని మళ్లీ నిర్మించడమే ఏకైక ప్రత్యామ్నాయమని క్వాలి టీ కంట్రోల్ నిపుణులు తేల్చారని ఫొటోలు, వీడియో క్లిప్స్ ద్వారా సీఎంకు వివరించారు. ఆ రహదారులు కోస్తా ప్రాంతానికి కీలకమైనవన్నారు.వీటికి నిధులెలా సమకూర్చాలన్న అంశం చర్చకొచ్చింది. ప్రభుత్వం వద్ద ఉన్న నాబార్డు నిధుల్లో నుంచి 650 కోట్లు ఇస్తామని సీఎం తెలిపారు.