మహారాష్ట్ర నూతన సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని ఆయన సందర్శించారు.
గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఫడ్నవీస్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం పండితులు శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు.