హిందూ ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇస్కాన్ సంస్థ వారు గజ్వేల్ లో పర్యటిస్తున్న సందర్భంగా సామాజిక సమరసతా వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేశ్ బాబును వారి స్వగృహంలో కలువడం జరిగింది. ఈ సందర్భంగా 2024 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా డా.నరేశ్ బాబు మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ వారు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు శ్లాఘనీయమని కొనియాడారు.
వారు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీమద్భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం అత తక్కువ ధరకు అందజేస్తున్నారనీ, ప్రజలంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డా . సాయినాథ్ రెడ్డి మరియు డా. నరేశ్ బాబు శ్రీమద్భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం పుస్తకాలు ఒక్కో సెట్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకమాత అహిల్యా బాయి హోల్కర్ చిత్రపటాన్ని ఇస్కాన్ సంస్థ నిర్వాహకులు శ్రీనాథ్ చరణ్ దాస్ కి బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా.మల్లయ్య, డా.మీల శ్రీధర్, డా. శివకుమార్, డా. సురేష్ రెడ్డి, డా.నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.