ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాగా.. ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అవకాశం కల్పించింది.ఈ క్రమంలో ఈ రోజు ఆయన రాజ్యసభకు నామినేషన్ వేశారు. మెడలో కాషాయ కండువాతో పార్లమెంట్ ఆవరణలో కనిపించిన ఆయన.. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు.. తాను చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తానని..బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పార్టీ తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. తాను బీసీల కోసం చేస్తున్న సేవలను గుర్తించి బీజేపీ తనకు రాజ్యసభ ఎంపీ గా అవకాశం కల్పించింది అని. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని.. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు. అలాగే తాను పార్టీలు మారడం లేదని.. తన వద్దకే పార్టీలు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.