వికారాబాద్ జిల్లా తాండూరులోని గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. కలుషితమై ఆహారం తినడంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
అస్వస్థతకు గురైన విద్యార్థినులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.