ఈక్వీటీ పెట్టుబడుల్లో హైరిటర్న్స్ వస్తుంటాయి. దీంతో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. మరి అన్ని ఫండ్స్ హైరిటర్న్స్ ఇవ్వవనేది గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు నెగెటివ్ రిటర్న్స్ సైతం ఇస్తుంటాయి. కానీ దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇచ్చేవే ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది 2024లో 10 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 30 శాతానికిపైగా లాభాలు అందించాయి. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఫండ్స్ పనితీరు పరంగా ఈ జాబితాలో సిద్ధం చేయడం జరిగింది. ఈ ఏడాదిలో 27 స్మాల్ క్యాప్ ఫండ్స్ మంచి పనితీరును కనబరిచాయి.
హైరిటర్న్స్ ఇచ్చిన స్మాల్ క్యాప్ ఫండ్స్ నాలుగు ఫండ్స్ ఈ 2024లో 40 శాతానికిపైగా లాభాలు అందించాయి. అందులో బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ స్కీమ్ ఈ ఏడాదిలో 47.73 శాతం మేర లాభాలు ఇచ్చింది. ఆ తర్వాత మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ 46.89 శాతం, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ 41.82 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ఈ ఏడాదిలో జనవరి 1, 2024 నుంచి డిసెంబర్ 9, 2024 వరకు 30 శాతానికిపైగా లాభాలు ఇచ్చిన టాప్-10 పథకాల జాబితా ఓసారి తెలుసుకుందాం.
బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 47.73 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ 46.89 శాతం లాభాలు అందించింది.
ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ 41.82 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 40.43 శాతం వార్షిక లాభాలు అందించింది.
ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 38.11 శాతం వార్షిక రిటర్న్స్ ఇచ్చింది.
టాటా స్మాల్ క్యాప్ ఫండ్ 36.04 శాతం మేర సగటు వార్షిక రిటర్న్స్ అందించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 35.77 శాతం మేర లాభాలు ఇచ్చింది.
హెచ్ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ 32.94 శాంత లాభాలు అందించింది.
మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 32.20 శాతం లాభాలు ఇచ్చింది.
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 30.39 శాతం మేర రిటర్న్స్ ఇచ్చింది.