భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే డబ్బే ముఖ్యం కాదు. కానీ, డబ్బు కూడా ఉండాలి. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ.. డబ్బుని చులకనగా ఎప్పుడు కూడా చూడొద్దు. ఇది ఏ బంధాన్నైనా బలంగా చేయగలదు.. బలహీనపర్చగలదు. ఇక భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో గొడవలు వచ్చి విడిపోయిన వారు చాలా మందే ఉంటారు. అలాంటి గొడవలు రావొద్దొంటే ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల ఇద్దరి మధ్య గొడవలు రావు. పైగా మీరు ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేయరు. దీంతో పాటు హ్యాపీగా రిలేషన్‌ని ఎంజాయ్ కూడా చేస్తారు.
డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ రావొద్దొంటే ముందుగా కూర్చుని ఇద్దరు మాట్లాడుకోవాలి. మనకి వచ్చే ఆదాయం ఎంత, అప్పులు ఎన్ని.. వచ్చిన డబ్బుతో ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ ముందుగానే మాట్లాడుకోవాలి. అప్పుడే డబ్బు విషయంలో ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి.
బడ్జెట్..
ప్రతి నెలా కూడా డబ్బు విషయంలో ఓ బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. ఎన్ని ఖర్చులున్నాయి, ఎంత వచ్చింది.. ఎంత మిగిలింది. ఇంటి కిరాయి, కరెంట్ బిల్ దగ్గర్నుంచి కూరగాయల ఖర్చుల వరకూ చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని మెన్షన్ చేస్తూ ఓ బడ్జెట్ క్రియేట్ చేసి దాని ప్రకారంగానే మీరు మనీ మేనేజ్ చేయాలి.
మీకంటూ కొద్దిగా..
బడ్జెట్‌లో ఇద్దరు కూడా వారికంటూ కొద్దిగా మనీని వారి అకౌంట్స్‌లో ఉంచుకోవాలి. ఇవి నెలవారీ ఖర్చులు, ఇష్టఇష్టాలు ఇలా ప్రతిదానికంటూ కొన్ని ఖర్చుల కోసం మనీని ఉంచేసుకోండి. దీంతో నెల మొత్తం ఖర్చులు అందులోనే అయ్యేలా చూసుకోండి.
సేవింగ్స్..
అదే విధంగా.. సంపాదించినదంతా మొత్తం ఖర్చులు, అప్పులకే కాకుండా కొంత ఎమౌంట్ ఎంత వీలైతే అంత మనీని సేవ్ చేయండి. ఇది భవిష్యత్‌లో అనుకోకుండా వచ్చే ఆపద నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. దీనికోసం ఇద్దరు జాయింట్ అకౌంట్ తీసి అందులో వేయండి. ఎలా అంటే 6 నెలల వరకూ ఎలాంటి జీతం లేకపోయినా ఈ మనీతో ముందుకెళ్ళే విధంగా మీ సేవింగ్స్ ఉండాలి. ఇలా ఉంచుకోవడం వల్ల మీ జాబ్ రిస్క్‌లో ఉన్నా ఎలాంటి సమస్యలొచ్చినా ఈ మనీతో మేనేజ్ చేయొచ్చు.
రిటైర్‌మెంట్..
రిటైర్‌మెంట్ కోసం ఇప్పట్నుంచీ కంగారెందుకు అనుకోవద్దు. కచ్చితంగా ముందునుంచే రిటైర్‌మెంట్ ప్లాన్ చేసుకోవడం బెటర్. దీంతో రిటైర్‌మెంట్ అయ్యాక ఎవరిపై కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు రిటైర్ అయ్యాక ఏం చేయాలనుకుంటారు, ఎలా జీవించాలనుకుంటున్నారు. ఇలాంటివన్నీ మీకంటూ ఓ ప్లాన్ ఉంటే ఎవరికైనా ఆ విషయం చెప్పి సలహా తీసుకోవడం మంచిది.
రెగ్యులర్‌గా చెక్ చేయడం..
అదే విధంగా.. ఇప్పటివరకూ ఎంత వరకూ పోగు చేశాం. మన గోల్స్‌ని ఎంత వరకూ రీచ్ అయ్యాం. ఎంత వరకూ, ఇంకేమైనా ఆర్థిక అవసరాలు వచ్చి చేరాయా.. దానికోసం మనం ఏం చేయాలి ఇలాంటి ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. దీంతో మీరు ఎలాంటి ఆర్థిక సమస్యలతో బాధపడకుండా హ్యాపీగా మీ రిలేషన్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీ పార్టనర్‌తో హ్యాపీగా మాట్లాడుతూ చెక్ చేస్తుండాలి. దీంతో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా మీ రిలేషన్ బాగుంటుంది.