భారత్‌లో ఆయుర్ధాయం పెరిగినప్పటికీ.. ఇటీవల జీవన శైలిలో మార్పులు సహా పెరుగుతున్న వాయు కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇప్పుడు చాలా మందికి అతిపెద్ద సమస్యగా మారింది. వృద్ధులు అని మాత్రమే కాకుండా.. యుక్త వయుస, మధ్యస్థ వయస్కుల్ని కూడా ప్రభావితం చేసే వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైద్య ద్రవ్యోల్బణంతో పలు వయస్కుల వారు.. అత్యవసర సమయాల్లో భారీగా అవుతున్న వైద్య బిల్లుల్ని నివారించేందుకు ఆరోగ్య బీమా పాలసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సమయంలోనే ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా రక్షించుకునేందుకు ఏ వయస్సు వారైనా మంచి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం మంచిది.
సాధారణంగా బీమా ప్రొవైడర్.. వసూలు చేసే ప్రీమియం మొత్తం.. పాలసీదారుడి వయసు మీద ఆధారపడి ఉంటుంది. పాలసీ ప్రీమియంలు బీమా సంస్థల్ని బట్టి మారుతుంటాయి. పలు బీమా సంస్థల్లో.. వివిధ వయస్కుల వారికి ఎంత బీమా ప్రీమియంలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. రూ. 10 లక్షల బీమా పాలసీపై వార్షిక ప్రీమియం అనేది ఏ పాలసీలో ఎంత ఉంటుందో చూద్దాం. పాలసీదారుడి వయసును 30 ఏళ్లు, 40 ఏళ్లు, 50 ఏళ్లు, 60 ఏళ్లు ఇలా ఎప్పుడు ఎంత కట్టాలో కింది పట్టికలో చూద్దాం.
పాలసీ పేరు 30 ఏళ్లు (వయసు) 40 ఏళ్లు 50 ఏళ్లు 60 ఏళ్లు
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్- సూపర్ స్టార్ రూ. 7584 రూ. 9336 రూ. 14,483 రూ. 23,041
HDFC ఎర్గో- ఆప్టిమా సెక్యూర్ రూ. 14,069 రూ. 16,367 రూ. 25,895 రూ. 41,589
ఐసీఐసీఐ లాంబార్డ్- ఎలివేట్ వాల్యూ రూ. 6199 రూ. 8,148 రూ. 12,749 రూ. 20,850
టాటా ఏఐజీ- మెడికేర్ ప్రీమియర్ రూ. 11,099 రూ. 14,493 రూ. 21,196 రూ. 32,935
బజాజ్ అలయంజ్- మై హెల్త్ కేర్ రూ. 8645 రూ. 10,790 రూ. 15,710 రూ. 26,948
జ్యూరిచ్ కోటక్- లైవ్‌వైజ్ రూ. 7230 రూ. 9259 రూ. 13,828 రూ. 25,454
డిజిట్ సూపర్‌కేర్ ఆప్షన్ (డైరెక్ట్) రూ. 6003 రూ. 8290 రూ. 13,443 రూ. 22,670
చోళమండలం ఎంఎస్- ఫ్లెక్సీ హెల్త్ రూ. 13,272 రూ. 15,789 రూ, 21,342 రూ. 37,817
రాయల్ సుందరం రూ. 8548 రూ. 10,556 రూ. 19,911 రూ. 39,551
రహేజా క్యూబీఈ - హెల్త్ క్యూబ్ బేసిక్ రూ. 5261 రూ. 6881 రూ. 10,820 రూ. 21,935
ఇఫ్కో- టోకియో- ఇండివిడ్యువల్ హెల్త్ ప్రొటెక్టర్ రూ. 12558 రూ. 15,629 రూ. 23,711 రూ. 31,715
చివరగా బీమాలో వివిధ ప్లాన్లు, ముందస్తు అనారోగ్యాలు, నివసించే ప్రాంతాల్ని బట్టి ప్రీమియంలో మార్పులు ఉండొచ్చని గుర్తుంచుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa