విద్యార్థులతో వెళుతున్న ఓ ఆటోను లారీ ఢీకొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. జాతీయ రహదారి-40పై కర్నూలు జిల్లా, ఓర్వకల్లు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషయ్య హోటల్ ఎదురుగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మండ లంలోని కన్నమడకల గ్రామానికి చెందిన వడ్డె స్వాములు ప్రతి రోజూ విద్యార్థులను తన ఆటోలో మోడల్ స్కూల్‌కు తీసుకెళు తుంటాడు. రోజు మాదిరి మంగళ వారం ఉదయం విద్యార్థులను తీసుకెళు తున్న సమయంలో ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను అధిగమించేందుకు ఆటోను కుడి వైపుకు తిప్పాడు. అదే సమ యంలో కర్నూలు వైపు వెళుతున్న లారీ ఆటోను వెనుక నుంచి ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. విద్యారు ్థలతోపాటు బ్యాగులు చెల్లాచె దురుగా పడిపోయాయి. ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదం డ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని స్థాని కుల సహాయంతో క్షతగా త్రులను 108లో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థి సుమంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. విద్యార్థులను మోడల్ స్కూల్ వద్ద నుంచి తీసుకొచ్చే క్రమంలో స్కూల్ ఆటో లన్నీ నిత్యం వ్యతిరేక మార్గంలో హైవేపై వస్తున్నాయని, దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్లు పూర్తి చేయడంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికా రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తు న్నారు. ఘటనా స్థలాన్ని ఓర్వకల్లు ఎంఈవో ఓంకార్ యాదవ్ ప్రమాదంపై స్థానికులను విచారించారు. ఓర్వకల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.