అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కు అనకాపల్లి గ్రామీణ విద్యుత్తు సరఫరా సహకార సంస్థ (ఆర్ఇసిఎస్) కు ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆరు మాసాలు పాటు కలెక్టర్ ఇన్ ఛార్జి బాధ్యతలలో ఉంటారు. అనకాపల్లి ఆర్ఇసిఎస్ లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి విదితమే.