అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ కేంద్రంగా సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్టు నగర సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రిజర్వ బ్యాంక్ అనుమతి లేకుండా బెట్టింగ్ యాప్ నడుపుతున్నారన్నారు. విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో ఒక వర్కింగ్ సెంటర్ పెట్టి ఈ వ్యవహారం నడిపిస్తున్నారన్నారు. ఇప్పటికే ఏడుగురి అదుపులోకి తీసుకున్నామన్నారు.