ధర్మవరం పట్టణానికి చెందిన పద్మశాలి బహుత్తమ సంఘం సభ్యులు బుధవారం ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ ని కలిసి పూలమాలతో సన్మానించడం జరిగింది. ఇటీవలే ధర్మవరం మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి బహోత్తమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గం సభ్యులు పరిటాల శ్రీరామ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.