ఏపీ కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియలో హోంగార్డులకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా గుర్తించాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆరువారాల్లోగా ప్రత్యేక మెరిట్ జాబితా సిద్ధం చేయాలంటూ ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో తమను ప్రత్యేక క్యాటగిరీగా పరిగణించాలంటూ భారీ సంఖ్యలో హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ల మీద విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిసెంబర్ మూడో తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా వెల్లడించింది.