ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ అధికారులైన భార్యాభర్తలు ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భర్తతో పాటు తన మృతదేహానికి కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని భార్య సూసైడ్ నోట్లో పేర్కొంది.
దీన్ దయాళ్ దీప్(32) ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పని చేస్తున్నారు. అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో అతడి భార్య రేణు తన్వర్ ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.