హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు పట్ల వివక్షత చూపించొద్దని యూత్ డెవలప్మెంట్ ప్రతినిధి శ్రీకాంత్ బాబు కోరారు. బొబ్బిలి పట్టణంలోని ఓ కళాశాలలో ఆయన ఎయిడ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
హెచ్ఐవి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూత్ డెవలప్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.