రాంబిల్లి మండలం మన్యపు చింతువ నేవీ కాలనీ చుట్టూ ఎన్ఏఓబీ నిర్మాణ పనుల్లో పాల్గొన్న పరవాడ గ్రామానికి చెందిన కార్మికుడు బండారు నీలబాబు(39) విద్యుత్ షాక్ తో బుధవారం మృతి చెందాడు.
మృతదేహాన్ని పరిశీలించిన సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు దేముడు నాయుడు మాట్లాడుతూ.. ఈ పనుల్లో పలుమార్లు ప్రమాదాలు జరిగినా పట్టించుకోకపోవడం విచారకరం అని అన్నారు. మృతుని కుటుంబానికి రూ. 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.