ఓ యువ ఐపీఎస్ అధికారికి మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ రాజకీయ నేత కుమార్తెతో ఇటీవల పెళ్లి ఖాయమైంది. మంగళవారం పెళ్లి జరగనుండగా వరుడుని ఇంటి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చేందుకు కార్యకర్తలు పార్టీ జెండాలతో వరుడి ఇంటికి వెళ్లారు.
అయితే అలా వద్దని పెళ్లి కుమారుడు ఎంత వారించినా వారు వినకపోవడంతో చివరికి పెళ్లినే క్యాన్సిల్ చేశారు. దీంతో వధువు తల్లికి గుండెపోటు వచ్చింది. అయితే చర్చల తర్వాత పెళ్లికి ఒప్పుకోవడంతో నేడు పెళ్లి జరగనుంది.