జమిలి ఎన్నికల బిల్లుపై రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
'సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి? ఇందులో ఏమన్నా అర్థముందా?' అని షర్మిల ట్వీట్ చేసింది.