ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆదేశాల మేరకు, జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ సూచనల మేరకు నందికొట్కూరు నిలిషికారి పేటలో బుధవారం ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు, ఎస్సై జఫ్రుల్లా తమ సిబ్బందితో ఆకస్మికంగా జరిపిన దాడులు జరిపారు. దాడుల్లో నాటుసారా అమ్ముతున్న, షికారి దుర్గ(29) వద్ద, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని, సారా తయారీకి సిద్ధం చేసిన 500 లీటర్ల బెల్లము ఊట, 20 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు.