శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం స్థానిక సుదర్శన్ థియేటర్ సమీపంలో ఉన్న భారత్ పెట్రోలియం బంకులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఏ క్షణంలో ఏమవుతుందో అని సమీపంలో ఉన్న గృహస్తులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నారు.