పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్షిప్ 3, 580 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు శుక్రవారం డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాయచోటిలో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత చదువులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 ను రద్దు చేయాలని కోరారు.