తీవ్ర ఒత్తిళ్లు, కాలుష్యం, సరైన పోషకాహారం లేకపోవడం వంటి కారణాలతో ఇటీవల చాలా మంది జుత్తు రాలిపోయే సమస్య ఎదుర్కొంటున్నారు. అంతేకాదు వెంట్రుకలు తెల్లబడటం, గరుకుగా మరి మధ్యలోకి తెగిపోవడం వంటి సమస్యలు మరెన్నో. అయితే కొన్ని రకాల పూలు ఈ సమస్యలను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయని... పైగా వెంట్రుకలు నల్లగా, నిగనిగలాడేలా చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎలా వాడితే ప్రయోజనం ఉంటుందో వివరిస్తున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం.మందార పూలలో కొన్ని రకాల అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అవి వెంట్రుకలు రాలిపోకుండా కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని మందార పూల రేకులు, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని... వాటిని బాగా కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలని సూచిస్తున్నారు. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలని... ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు నల్లగా, నిగనిగలాడుతూ పెరుగుతాయని చెబుతున్నారు.తామర పుష్పాలు.పొడిబారిపోయి, దెబ్బతిన్న వెంట్రుకలు తిరిగి నిగనిగలాడేలా చేసే సామర్థ్యం తామర పుష్పాల సొంతం. తామర పూల రేకుల నుంచి ఆయిల్ ను తీసి, లేదా రసం తీసి... కొంచెం కొబ్బరి నూనెలో కలిపి వెంట్రుకలు, కుదుళ్లకు మర్దన చేయాలి. అరగంట తర్వాత కడిగేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈ పూలలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి దెబ్బతిన్న వెంట్రుకల కుదుళ్లను పునరుద్ధరించడానికి తోడ్పడతాయి. గులాబీ రేకులను నీటిలో వేసి మరిగించి... ఆ నీటిని నిల్వ చేసుకోవాలి. తల స్నానం చేసిన తర్వాత వెంట్రుకలు, కుదుళ్లకు ఆ నీటిని పట్టిస్తే వెంట్రుకలు నిగనిగలాడతాయని నిపుణులు చెబుతున్నారు.బంతి పూలలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయని, అవి వెంట్రుకల కుదుళ్లలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించి పునరుద్ధరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినూనెలో కొన్ని బంతిపూల రేకులను వేసి నానబెట్టుకోవాలని... వెంట్రుకలు, కుదుళ్లకు ఈ నూనెతో మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.వెంట్రుకలు పొడిబారి, తెగిపోకుండా మల్లె పూలు రక్షిస్తాయని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. ఇవి వెంట్రుకల కుదుళ్లకు పోషణను ఇచ్చి, బలోపేతం చేస్తాయని చెబుతున్నారు. జాస్మిన్ ఆయిల్ ను, కొంత విటమిన్-ఈ ఆయిల్ తో కలిపి వెంట్రుకలు, కుదుళ్లకు పట్టేలా మర్దన చేయాలని సూచిస్తున్నారు. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలని వివరిస్తున్నారు.ఈ పూల వినియోగం, తీరు ఆయుర్వేద నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం పేర్కొన్నవే. వ్యక్తులను బట్టి, వినియోగం తీరును బట్టి ఫలితాలు వేర్వేరుగా ఉండవచ్చు. అందువల్ల దగ్గరిలోని ఆయుర్వేద నిపుణులను సంప్రదించి వినియోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు