దానిమ్మ గింజలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ గింజలు యాంటీ ఆక్సిడెంట్లు, పొలిఫినాల్స్ అనే రసాయనాలతో నిండి ఉంటాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇంకా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పులు, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే వీటిని మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే వాంతులు, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.