ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏఐ (ఏఐ) ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కొంతమంది సెలబ్రిటీలకు ఈ ఏఐ తలనొప్పిగా మారింది.. వాళ్ల ఫోటోలను ఏఐ ద్వారా మార్చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూస్తే నిజం అనిపించేలా ఉంటున్నాయి.. దీంతో కొందరు నెటిజన్లు నిజమైన ఫోటోలు అని పొరబడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా క్రికెటర్ల ఫోటోలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిజంగానే పాండ్యా, సారాలు కలిసి క్రిస్మస్ జరుపుకున్నారా? ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుసుకుందాం..
క్లెయిమ్ ఏంటి?
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి సారా అలీఖాన్ క్రిస్మస్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2024 డిసెంబర్ 26న ఐఏఎస్ ఫ్యాన్స్ క్లబ్ ఇండియా (IAS Fans Club India) ఫేస్‌బుక్ యూజర్ 'హార్దిక్ పాండ్యా, సారా అలీఖాన్ క్రిస్మస్ ఎంజాయ్ చేస్తున్నారు' అంటూ క్యాప్షన్‌తో ఈ ఫోటోలను షేర్ చేశారు. ఇదే ఐఏఎస్ ఫ్యాన్స్ క్లబ్ ఇండియా (IAS Fans Club India) ఫేస్‌బుక్ యూజర్ 2024 డిసెంబర్ 23న కూడా హార్దిక్ పాండ్యా, సారా అలీఖాన్ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
అసలు నిజం ఏంటి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్యా, సారా అలీఖాన్ ఫోటోలు ఏఐ ద్వారా జనరేట్ చేసినవిగా గుర్తించడం జరిగింది. ఈ ఫోటోలతో హార్దిక్ పాండ్యా, సారా అలీఖాన్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తప్పుడు పరచారం చేస్తున్నట్లు తేలింది.
ఎలా నిర్ధారించారంటే..
ఈ క్లెయిమ్‌పై ఆరా తీసే క్రమంలో.. ఈ ఫోటోలను జాగ్రత్తగా గమనిస్తే కొన్ని అంశాలను పరిగణించడం జరిగింది. ఈ ఫోటోలలో మొహాలు కూడా కొంత అసహజంగా, స్మూత్‌గా కనిపించాయి. పాండ్యా, సారాల డ్రెస్‌లు, లైటింగ్ కూడా చూడటానికి మామూలు ఫోటోల్లో లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే అనుమానాస్పదంగా కనిపించాయి. సారా అలిఖాన్ మొహం కూడా చూడటానికి అసహజంగా ఓ బొమ్మలా కనిపించింది. ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఫోటోలు ఏఐ జనరేట్‌గా అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని నిర్ధారించడానికి.. ప్రతి ఫోటోను ఏఐ ఇమేజ్ డిటెక్షన్ టూల్స్ ద్వారా చెక్ చేయడం జరిగింది.
మొదటి ఫోటో
మొదటి ఫోటోను ఏఐ ఇమేజ్ డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్‌ని ఉపయోగించి చెక్ చేస్తే.. ఇది ఫోటో ఏఐతో రూపొందించబడిందని 98.9శాతం తేలింది.
మొదటి ఫోటో
రెండో ఫోటో
రెండో ఫోటోను కూడా ఏఐ ఇమేజ్ డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్‌ని ఉపయోగించి తనిఖీ చేయగా.. ఈ ఫోటో కూడా ఏఐతో రూపొందించబడిందని 99.8శాతం తేలింది.
రెండో ఫోటో
మూడో ఫోటో
మూడో ఫోటోను కూడా ఏఐ ఇమేజ్ డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్‌ని ఉపయోగించి చెక్ చేయగా.. ఈ ఫోటో కూడా ఏఐతో రూపొందించబడిందని 99.9శాతం తేలింది.
మూడో ఫోటో
నాలుగో ఫోటో
నాలుగో ఫోటోను కూడా ఏఐ ఇమేజ్ డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్ సాయంతో తనిఖీ చేస్తే.. ఈ ఫోటో కూడా ఏఐతో రూపొందించబడిందని 99.8శాతం తేలింది.
నాలుగో ఫోటో
ఐదో ఫోటో
ఐదో ఫోటోను సైతం ఏఐ ఇమేజ్ డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్ సాయంతో చెక్ చేస్తే.. ఈ ఫోటో కూడా ఏఐతో రూపొందించబడిందని 99.6శాతం తేలింది.
ఐదో ఫోటో
ఆరో ఫోటో
ఆరో ఫోటోను కూడా ఏఐ ఇమేజ్ డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్ సాయంతో చెక్ తనిఖీ చేయగా.. ఈ ఫోటో కూడా AIతో రూపొందించబడిందని 99.9శాతం తేలింది.
ఆరో ఫోటో
ఈ ఫోటోల అంశంపై ఏఐ నిపుణుడు అన్ష్ మెహ్రాను సంప్రదించగా.. 'ఈ ఫోటోలన్నీ ఫేక్.. కొన్ని ఫోటోలను ఉపయోగించి ప్రాంప్ట్ ద్వారా కొత్తగా ఫోటోలను ఇటువంటి సృష్టించవచ్చు'అని తెలిపారు. ఈ ఫోటోలను షేర్ చేసిన ఐఏఎస్ ఫ్యాన్స్ క్లబ్ ఇండియా (IAS Fans Club India) ఫేస్‌బుక్ యూజర్‌కు లక్షమందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఇది అసలు వాస్తవం
హార్దిక్ పాండ్యా, సారా అలీఖాన్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారం తప్పని తేలింది. ఈ ఫోటోలు ఏఐ (AI) ద్వారా రూపొందించినట్లు గుర్తించడం జరిగింది. ఏఐ ఇమేజ్ డిటెక్షన్ టూల్స్ ద్వారా ఈ ఫోటోలన్నీ 98.9శాతం నుంచి 99.9శాతం వరకు.. ఏఐ ద్వారా రూపొందించబడినవని తేలింది.