బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఆసీస్ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఖవాజా 41, హెడ్ (34*), వెబ్‌స్టర్ (39*) సామ్ కొనస్టాస్ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.