ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఓడిపోవడంపై టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా స్పందించారు. ‘‘ఈ సిరీస్‌లో కుర్రాళ్లు అదరగొట్టారు. ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకోగలిగారు. మంచి అనుభవం సాధించారు.
సిరీస్‌ను గెలిచిన ఆసీస్‌కు శుభాకాంక్షలు’’అని బుమ్రా వెల్లడించాడు. కాగా, ఈ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.