ఆసీస్ ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్(41) తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో క్రిస్టియన్ సిడ్నీ థండర్ తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
ప్రస్తుతం ఇతడు థండర్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయాలతో సతమతమవుతున్న టీమ్‌ను ఆదుకునేందుకు బరిలోకి దిగనున్నాడు. థండర్ యాజమాన్యం కోరిక మేరకు క్రిస్టియన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు.