సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకి 7-8 గంటల నిద్ర సరిపోతుంది. కానీ, కొందరు 9 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోతుంటారు. ఇలా అతిగా నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇంకా శరీరంలో కొవ్వును పెంచుతుంది. ఊబకాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.