సన్నగా కనిపిస్తే అందంగా ఉంటామని చాలా మంది అనుకుంటారు. నేటికాలంలో చాలా మంది బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా అనుకున్నట్లుగా ఫిట్‌గా ఉండలేకపోతున్నారు. అయినప్పటికీ బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి టైమ్‌లో ఉన్నట్టుండి సన్నగా కనిపించలేరు. కానీ, కొన్ని టిప్స్ ఫాలో అయితే, ఎంత బరువుగా ఉన్నా సన్నగా, అందంగా కనిపిస్తారు.
బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ, మనం ఫాలో అయ్యే కొన్ని కొన్ని టిప్స్ కారణంగా సన్నగా, నాజుగ్గా కనిపించొచ్చు. దీనికి ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం కూడా లేదండి. కొన్ని ఫ్యాషన్ టిప్స్ ఫాలో అయితే సరి. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.
పొడవైన నెక్లెస్‌లు
మెడలో పొడుగ్గా నెక్లెస్‌లు వేసుకోండి. ఇవి మిమ్మల్ని పొడుగ్గా కనిపించేలా చేస్తాయి. అదే విధంగా, సన్నగా కనిపించేలా చేస్తాయి. అదే విధంగా, హీల్స్ వేసుకోవడం అలవాటు చేసుకోండి. వీటి వల్ల కూడా మీ లుక్ ఎన్‌హెన్స్ అవుతుంది. అయితే, హీల్స్ కంఫర్ట్‌గా ఉన్నవే వేసుకోండి. దీంతో చూడ్డానికి ఇబ్బందిగా లేకుండా ఉంటుంది.
స్కార్ఫ్ స్టైల్ చేయండిలా..
స్టైల్.. స్టైల్‌గా స్కార్ప్ కట్టేసుకోండి
లూజ్‌గా ఉండే బట్టలు వద్దు
లూజ్‌గా ఉండే బట్టలు ప్రజెంట్ ట్రెండ్ అయ్యాయని అందరూ వేసుకుంటున్నారు. కానీ, బరువుగా ఉన్నవారిని ఇలాంటి బట్టలు మరింత లావుగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి, లూజ్‌గా కాకుండా మీకు సెట్ అయిన సరైన ఫిట్టింగ్ ఉండే బట్టల్ని ఎంచుకోండి. వీటితో పాటు పెద్ద పెద్ద ప్రింట్స్, వర్క్ ఉన్న వాటి బదులు ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకోండి.
బెల్ట్ వాడడం
బెల్ట్ వాడడం వల్ల కూడా మీరు సన్నగా కనిపిస్తారు. దీని వల్ల మీ నడుము సన్నగా కనిపిస్తుంది. ఆడవారు, చీరలు, లంగావోణీలపైకి ఒడ్డాణం వంటివి ట్రై చేయొచ్చు. వీటితో మీ లుక్ మారుతుంది. సన్నగా కూడా కనిపిస్తారు. మరీ హెవీ ఒడ్డాణాలు కాకుండా సన్నవి కూడా ట్రై చేయొచ్చు. దీంతో మీ లుక్ చాలా బాగుంటుంది.
నిలువు గీతల డ్రెస్సెస్
అడ్డంగా ఉండే గీతల డ్రెస్సెస్ మనం ఉన్నదానికంటే లావుగా ఉన్నట్లు కనిపించేలా చేస్తాయి. అలా కాకుండా నిలువు గీతలు ఉండే డ్రెస్సెస్ ట్రై చేయండి. దీంతో చూడ్డానికి కూడా చక్కగా కనిపిస్తారు. అవి కూడా మంచిగా నీట్‌గా ఐరన్ చేసినట్లుగా ఉండాలి. ముడతలుగా అసలు ఉండకూడదు.
డార్క్ కలర్స్ వేసుకోవడం
డార్క్ కలర్స్ అంటే బ్లాక్, నేవీ బ్లూ, థిక్ గ్రీన్ వంటి కలర్ డ్రెస్సెస్ వేసుకోండి. దీని వల్ల చూడ్డానికి చక్కగా కనిపించడం మాత్రమే కాదు. అవి సన్నగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి, ఇలాంటి కలర్స్‌ని ప్రిఫర్ చేయండి. వీటిని మంచి కాంబినేషన్‌తో పెయిర్ అప్ చేయండి. దీంతో చూడ్డానికి బావుంటారు. పొడుగ్గా కనిపిస్తారు.