బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 జరుగుతుండగానే టీమిండియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్.. అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. మూడో టెస్టు మ్యాచ్ తర్వాత అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. మరుసటి రోజే.. భారత జట్టును వీడి.. ఇండియా వచ్చేశాడు. కాగా రవిచంద్రన్ అశ్విన్.. తీసుకున్న నిర్ణయం భారత క్రికెట్ అభిమానులకు షాక్‌కు గురి చేసింది. అతడు ఈ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడని ఎవరూ ఊహించలేదు.
కాగా రవిచంద్రన్ అశ్విన్ ఎందుకు ఇంత సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో ఈ విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే అశ్విన్ రిటైర్మెంట్పై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ స్పందించాడు.
“బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ సరైన సన్నద్ధత లేకుండానే బరిలోకి దిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మూడు టెస్టులకు భారత్ ముగ్గురు విభిన్నమైన స్పిన్నర్లతో ఆడటాన్ని బట్టే ఈ విషయం అర్థం అవుతోంది. అయితే ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధించి ఉంటే.. ఆ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే.. అంతా సవ్యంగా సాగుతున్నట్లు లెక్క. కానీ అతడు సిరీస్ మధ్యలోనే వీడ్కోలు పలకడం తమాషాగా ఉంది” అని హాడిన్ అభిప్రాయపడ్డాడు.
నా ఉద్దేశంతో తుది జట్టులో చోటు ఎక్కువ మ్యాచులలో చోటు దక్కకపోవడం వల్లే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కువ మ్యాచ్‌లకు రిజర్వ్ బెంచ్‌పై ఉండటం అశ్విన్‌కు నచ్చలేదని తెలుస్తోంది. ‘ఆసీస్‌పై మెరుగైన రికార్డు ఉన్న స్పిన్నర్‌గా నేను రిజర్వ్ బెంచ్‌పై కూర్చోలేను. నేను అత్యుత్తమ స్పిన్నర్ కాదని మీరు నిర్ణయించినప్పుడు ఇక్కడితో ఆటకు ముగింపు పలుకుతా’ అని అశ్విన్ అనుకొని ఉండొచ్చు” అని బ్రాడ్ హాడిన్ వ్యాఖ్యానించాడు.
కాగా అశ్విన్ రిటైర్మెంట్పై అతడి తండ్రి రవిచంద్రన్ సైతం ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు చాలాకాలంగా అవమానాలకు గురవుతున్నాడని, అందుకే ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాడని చెప్పుకొచ్చాడు. కాగా రవిచంద్రన్ అశ్విన్ 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున 287 మ్యాచ్‌లు ఆడి.. మొత్తంగా 765 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 6 సెంచరలు సహా.. 4,394 అంతర్జాతీయ పరుగులు చేశాడు.