ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏం రాసినా స్కిన్ డ్రైగా మారుతుందా, ఇలా చేయండి చాలు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 11:25 PM

చలికాలంలో చర్మం డ్రైగా మారుతుంది. దీంతో చర్మ సమస్యలొస్తాయి. పగులుతుంది. ఇలాంటి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కోసం బయటి వాతావరణం, దుమ్ము, ధూళిని తొలగించి చర్మాన్ని స్క్రబ్ చేయడానికి మాయిశ్చరైజ్ చేయడం ముఖ్యం.


అదే విధంగా, సూర్యుని హానికరమైన కిరణాల నుండి కాపాడుకునేందుకు సన్‌స్క్రీన్ వాడడం మంచిది. అందువల్ల, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన టిప్స్ ఫాలో వల్ల చలికాలంలో ముఖంపై కనిపించే పొడి, మచ్చల్ని తొలగించడంలో హెల్ప్ అవుతుంది. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.


క్లెన్సింగ్


చర్మాన్ని కాపాడుకునేందుకు ఇంట్లోని పచ్చి, గోరువెచ్చని పాలు వాడి క్లెన్సింగ్ చేయొచ్చు. దీనికోసం పాలలో దూదిని ముంచి ముఖాన్ని క్లీన్ చేయాలి. స్క్రబ్ కోసం పచ్చి పాలలో కొంచెం కాఫీ పౌడర్, ఉప్పు వేసి పేస్టులా చేయండి. ఇది చర్మంపై బాగా పనిచేస్తుంది. ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. కళ్ల కింద సున్నిత ప్రాంతాన్ని వదిలి వృత్తాకారంగా మీ ముఖంపై పేస్టుని సున్నితంగా రుద్దండి. కాసేపటి తర్వాత నీటితో క్లీన్ చేయండి.


మెరిసే చర్మం కోసం.. విటమిన్‌ సి సీరం


టోనర్


చర్మం పొడిగా ఉన్నవారు టోనర్‌కి దూరంగా ఉంటారు. కానీ, చలికాలంలో సరైన హైడ్రేషన్ అందించడం మంచిది. అందుకే, ఆర్గానిక్ రోజ్ వాటర్‌ని ఎంచుకోవచ్చు. దీన్ని ముఖంపై స్ప్రే చేయాలి. ఓ సారి ముఖానికి రాసిన తర్వాత ఆరేవరకూ ఉంచండి.


మాయిశ్చరైజర్


చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు సాధారణంగా విటమిన్ ఆయిల్, కొబ్బరినూనె, ఆలివ్ నూనెలు వాడుతుంటారు. జొజొబా నూనె ఈ మధ్యకాలంలో ఫేమస్ అయింది. ఎందుకంటే ఇది లైట్‌గా ఉంటుంది. రంధ్రాలను తగ్గిస్తుంది. చర్మ సంరక్షణకి ఇది మంచిది. ఇది మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చలికాలంలో కూడా సన్‌స్క్రీన్ వాడడం చాలా ముఖ్యం. ఈ సమయంలో కూడా సూర్యకిరణాలు చర్మాన్ని దెబ్బ తీస్తాయి. కాబట్టి, సూర్యుని కిరణాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం.


బటర్


నెయ్యిలోని ఫాస్పోలిపిడ్స్, స్టెరాల్స్ సూర్యుడు, దుమ్ము, కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాతాయి. మరిన్ని బెనిఫిట్స్ కోసం విటమిన్ ఇ, బాదం ఆయిల్ కలిపి వాడండి. యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేసే కొన్ని చుక్కల్ని వేయండి. దీని బదులు, ఆర్గానిక్ షియ, కోకోబటర్ వాడండి. మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వాలంటే రెగ్యులర్‌గా చర్మాన్ని స్క్రబ్ చేయాలి.


సీరమ్


కోల్డ్ ప్రెస్ వాల్‌నట్ ఆయిల్ మీ చర్మాన్ని మృదువుగా, పోషణతో ఉంచి వృద్ధాప్య సంకేతాల్ని తగ్గిస్తుంది. కాబట్టి, పడుకునే ముందు రెగ్యులర్‌గా నైట్ సీరమ్ అప్లై చేయాలి. దీంతో చర్మం మృదువగా ఉంటుంది. దీనికోసం ముఖం, మెడ, కళ్ల చుట్టూ మసాజ్ చేయడం వల్ల ఫైన్‌లైన్స్ తగ్గుతాయి.


ఫేస్‌ప్యాక్స్


అదే విధంగా, ఫేస్ అందంగా కనిపించేందుకు రెగ్యులర్‌గా ఫేస్‌ప్యాక్స్ వాడాలి. దీనికోసం ఓ టేబల్ స్పూన్ ఓట్స్, రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, అర టీ స్పూన్ నెయ్యి కలిపి పేస్టులా చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ​గమనిక:నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com