రోజూ బెల్లం తినడం వల్ల రక్తహీనతను తగ్గించడంలో బెల్లం భేషుగ్గా పనిచేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నెలసరి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది బెల్లం. నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపునొప్పితో బాధపడతారు. ఈ నొప్పిని తగ్గించడంలో బెల్లం చాలా ఉపయోగపడుతుంది. వంటకాల్లో బెల్లం తరచుగా తీసుకోవడం వలన ఈ సమస్యలను తగ్గించవచ్చు. శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గించడంలో కూడా బెల్లం సహాయ పడుతుంది. అంతేకాదు, శ్వాస సంబంధిత సమస్యలు, అలెర్జీలకు బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. రోజు బెల్లం తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత అలెర్జీలు, గొంతు ఇబ్బందులు తగ్గుతాయి. మలబద్దకాన్ని నివారిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గించడంతో పాటు ఎముకలకు బలాన్నిస్తుంది. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.